పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జవహర్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. నిత్యం మద్యం తాగి భార్యను వేధింపులకు గురి చేస్తున్న భర్తను ఆగ్రహంతో కత్తితో దాడి చేసింది. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. గోదావరిఖని జవహర్ నగర్ కు చెందిన కొయ్యడ చంద్రయ్య గోదావరిఖని 7 ఎల్ఈపీ బొగ్గు గనిలో ట్రామర్గా విధులు నిర్వహిస్తున్నాడు. గత కొంత కాలం నుంచి మద్యానికి బానిసై నిత్యం చిత్తుగా తాగి కుటుంబ సభ్యులను వేధించేవాడు. అనుమానంతో భార్యను ఇబ్బందులకు గురి చేసే వాడు. సహనం కోల్పోయిన భార్య భాగ్యమ్మ మద్యం తాగి వచ్చిన చంద్రయ్యతో గొడవ పడింది. శరీరంపై కారం పొడి చల్లి ఇంట్లో ఉన్న కత్తితో మెడపై, శరీరంపై విచక్షణారహితంగా దాడి చేసింది. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. గోదావరిఖని ఒకటో పట్టణ సీఐ రమేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
'మద్యానికి బానిసైన భర్తను చంపిన భార్య' - undefined
తాగుడుకు బానిసైన భర్త ఆగడాలను తట్టుకోలేకపోయిన భార్య..తన భర్తను కత్తితో పొడిచి చంపిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో కలకలం రేపింది.
సహనం కోల్పోయి తాగుబోతు భర్తను కడతేర్చిన భార్య