తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి సుపరిపాలన అందిస్తున్నారని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా... పెద్దపల్లిలో పంచాయతీరాజ్ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నాలుగు దశాబ్ధాలపాటు పాలించిన ప్రతిపక్షాల వల్ల తెలంగాణ చాలా వెనకబడిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తెరాస రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు: కొప్పుల - welfare minister koppula eeshwar atpanchayatiraj sammelanam
పెద్దపల్లిలో నిర్వహించిన పంచాయతీరాజ్ సమ్మేళనానికి సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించేందుకు ముఖ్యమంత్రి సుపరిపాలన అందిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు: కొప్పుల
ప్రజల ఓట్లతో గెలుపొందిన ప్రజాప్రతినిధులు నిస్వార్థంగా పనిచేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి అనేక షరతులు, నిబంధనలు విధించినట్లు మంత్రి పేర్కొన్నారు. పంచాయతీ, మున్సిపాలిటీల్లో గెలుపొందినవారు అవినీతికి పాల్పడకుండా సీఎం ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో తెలంగాణాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు.
రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు: కొప్పుల
ఇదీ చూడండి:ఐటీ దాడుల విషయంపై స్పందించిన హీరోయిన్ రష్మిక