తెలంగాణ

telangana

ETV Bharat / state

'బంగారు తెలంగాణ పేరిట మమ్మల్ని రోడ్డుకు ఈడ్చారు' - GODAVARIKHANI BUS DEPOT

ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 20వ రోజుకు చేరుకుంది. గోదావరిఖని బస్సు డిపో వద్ద ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలో మహిళా సంఘాలు తమ మద్దతు తెలిపాయి.

జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెకు మహిళా సంఘాల మద్దతు

By

Published : Oct 24, 2019, 1:59 PM IST

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డిపో వద్ద కార్మికులకు సంఘీభావంగా మహిళా సంఘాలు దీక్షలో పాల్గొన్నాయి. ఆర్టీసీ కార్మికులు 20 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మహిళా సంఘాల నాయకులు అన్నారు. బంగారు తెలంగాణ పేరిట ఆర్టీసీ కార్మికులను రోడ్డు పాలు చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెకు మహిళా సంఘాల మద్దతు

ABOUT THE AUTHOR

...view details