ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తాం: దేవసేన - పెద్దపల్లి
పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ దేవసేన తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల్లో అధికంగా బలగాలు మోహరించామన్నారు.
ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తాం
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో గురువారం జరగనున్న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ దేవసేన తెలిపారు. 307 అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామని.. వాటిపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తామన్నారు కలెక్టర్ దేవసేన.