తెలంగాణ

telangana

ETV Bharat / state

పార్వతి బ్యారేజ్ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల - గేట్లు ఎత్తివెత

పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి బ్యారేజ్ వద్ద 60 గేట్లు ఎత్తి నిరంతరాయంగా గోదావరి నదిలోకి వరద నీటి విడుదల కొనసాగుతోంది. గత పదహారు రోజులుగా గోదావరికి వస్తున్న వరద నీటి ప్రవాహాన్ని అధికారులు కిందకు వదులుతున్నారు. గోదావరిపై నిర్మించిన జలాశయాలన్ని వరద నీటితో నిండు కుండలను తలపిస్తున్నాయి.

Water Releasing continue in Parvathi barrage
పార్వతి బ్యారేజ్ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

By

Published : Sep 28, 2020, 10:58 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి బ్యారేజ్​కి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు 60 గేట్లు ఎత్తి నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. గత 16 రోజులుగా గోదావరి నదికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. అటు మహారాష్ట్రలో, ఇటు తెలంగాణలో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి మీద నిర్మించిన జలాశయాలన్ని నిండు కుండలను తలపిస్తున్నాయి. ఎల్లంపల్లి వద్ద నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడం వల్ల 2,54,975 క్యూసెక్కుల నీటిని పార్వతి బ్యారేజికి విడుదల చేస్తున్నారు. బ్యారేజ్​కు గల 74 గేట్లలో 60 గేట్లను ఎత్తి గత 16 రోజులుగా వరద నీటిని దిగువకు వదులుతున్నారు.

పార్వతి బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 8.83 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 6.895 టీఎంసీల నీటినిల్వ ఉంది. బ్యారేజ్ పూర్తిస్థాయి నీటినిల్వ కెపాసిటీ 130 మీటర్లు. అయితే.. ప్రస్తుతం 128.75మీటర్ల వరకు నీటి నిల్వ ఉంది. పార్వతి బ్యారేజ్​లోకి 2,55,475 క్యూసెక్కుల నీరు ఇన్​ఫ్లోగా వస్తుండగా, ఔట్ ఫ్లో కూడా అదే స్థాయిలో ఉంది. వచ్చిన నీటిని వచ్చినట్లు పార్వతి బ్యారేజి నుంచి దిగువకు నీటిని వదులుతున్నారు. గోదావరి ప్రమాదకరంగా ప్రవహిస్తుండటం వల్ల గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:వరుస ఎన్నికలపై కారు నజర్‌.. పకడ్బందీ వ్యూహంతో కార్యాచరణ

ABOUT THE AUTHOR

...view details