పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ఎస్సారెస్పీ ప్రాజెక్టు 40 గేట్లు తెరిచి 1.5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు భారీగా వస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు 27 గేట్లు ఎత్తి 2,77,128 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
గోదారమ్మ పరవళ్లతో నిండుకుండలా ఎల్లంపల్లి జలాశయం - ఎల్లంపల్లి ప్రాజెక్టు లేటెస్ట్ వార్తలు
ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో పెద్దపల్లి జిల్లా అంతర్గాంలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి భారీగా నీరు వస్తున్నందున ఎల్లంపల్లి ప్రాజెక్టు 27 గేట్లు ఎత్తి 2.77 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు.
గోదారమ్మ పరవళ్లతో నిండుకుండలా ఎల్లంపల్లి జలాశయం
ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం నీటిమట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 147.51 మీటర్లకు చేరింది. జలాశయంలో మొత్తం నీటి నిల్వ 20.175 టీఎంసీలు ఉండగా.. 18.81 టీఎంసీల నీటి నిల్వ కొనసాగుతోంది. ఆగస్టు 17 నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు తెరిచి నిరంతరం నీటిని విడుదల చేస్తున్నారు.