పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని భక్తుల పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుగా నీటిని దిగువకు వదిలారు. రెండు గేట్ల నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని వదిలారు. నీటి ప్రవాహం పెరుగుతున్నందున గోదావరి పరివాహక ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువనున్న కడెం జలాశయం నుంచి 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
నీటి విడుదల - శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం
శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం నుంచి గోదావరి జలాలను విడుదల చేశారు. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
నీటి విడుదల