తెలంగాణ

telangana

ETV Bharat / state

కాళేశ్వరం ఆరో ప్యాకేజీ సొరంగంలోకి నీటి విడుదల

పెద్దపల్లిలోని శ్రీపాద ఎల్లంపల్లి  నుంచి నీటి విడుదల ప్రారంభమైంది. కాళేశ్వరం ఆరో ప్యాకేజీ సొరంగం గుండా ఈ నీరు ధర్మారం చెరువును చేరుతుంది.

water-release

By

Published : Apr 17, 2019, 3:18 PM IST

పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కాళేశ్వరం ఆరో ప్యాకేజి సొరంగంలోకి అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ ఉదయం ప్రాజెక్టు వద్ద పూజలు నిర్వహించిన అనంతరం ఇంజినీర్ ఇన్ చీఫ్ ​ వెంకటేశ్వరరావు ఒక గేటు ఎత్తి నీటిని వదిలారు. ఈ నీరు ఇక్కడి నుంచి 9.54 కిలోమీటర్లు ప్రవహించి ధర్మారం చెరువులోకి చేరనుంది.

కాళేశ్వరం ఆరో ప్యాకేజీ సొరంగంలోకి నీటి విడుదల

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details