పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని అన్నారం పంప్ హౌస్ నుంచి సుందిళ్ల పార్వతి జలాశయానికి నీటిని ఎత్తిపోస్తున్నారు. అన్నారం పంప్ హౌస్ లోకి 2900 క్యూసెక్కుల నీరు వస్తోంది. సుందిల్ల పార్వతి జలాశయంలో ప్రస్తుతం 8.83 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గడం వల్ల అన్నారం పంప్‌హౌస్ నుంచి సుందిళ్ల పార్వతి బ్యారేజీలోకి నీటిని ఎత్తి పోస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక్కడి నుంచి ఎల్లంపల్లికి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.
కాళేశ్వరం జలాలు ఎల్లంపల్లికి తరలింపు - water transfer from annaram pump house to sumdilla reservoir
కాళేశ్వరం జలాలను ఎల్లంపల్లి జలాశయానికి తరలిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా అన్నారం పంప్‌హౌస్ నుంచి నాలుగు మోటార్ల ద్వారా... సుందిళ్ల పార్వతి బ్యారేజ్‌లోకి నీటిని నిరాటంకంగా ఎత్తిపోస్తున్నారు.
![కాళేశ్వరం జలాలు ఎల్లంపల్లికి తరలింపు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5135068-thumbnail-3x2-pump-rk.jpg)
కాళేశ్వరం జలాలు ఎల్లంపల్లికి తరలింపు