ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నిండుకుండలా మారి జలకళను సంతరించుకుంది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు వద్ద నిర్మించిన సరస్వతి పంప్‌హౌస్ నుంచి గతవారం రోజులుగా పార్వతి బ్యారేజ్‌లోకి నీటిని అధికారులు ఎత్తి పోస్తున్నారు. సరస్వతి పంప్‌హౌస్‌లో పది రోజుల కిందట మొదట రెండు మోటార్లతో నీటిని ఎత్తిపోయడం ప్రారంభించారు. మూడు రోజులుగా 5 మోటార్లను నడిపిస్తూ.. పార్వతి బ్యారేజ్‌లోకి నీటిని ఎత్తిపోస్తూ... ఇవాళ ఏకంగా 7 మోటార్లను నడుపుతున్నారు.
జలకళను సంతరించుకున్న పార్వతి బ్యారేజ్ - కాళేశ్వరం ఎత్తిపోతలు
పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు వద్ద నిర్మించిన సరస్వతి పంప్‌హౌస్ నుంచి గతవారం రోజులుగా పార్వతి బ్యారేజ్‌లోకి నీటిని అధికారులు ఎత్తి పోస్తున్నారు. దీనితో పార్వతి బ్యారేజ్ జలకళను సంతరించుకుంది.
సరస్వతి పంప్ హౌస్‌లో మొత్తం ఎనిమిది మోటార్లను అమర్చారు. సరస్వతి పంప్‌హౌస్ నుంచి 7 మోటార్లను నడిపిస్తూ 14 పైపుల ద్వారా 20 వేల 300 క్యూసెక్కుల నీటిని పార్వతి బ్యారేజ్‌లోకి ఎత్తి పోస్తున్నారు. పార్వతి బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 8.83 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం 5.95 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. బ్యారేజ్‌లోకి 7 మోటార్ల ద్వారా నీటి ఎత్తిపోతలు చేస్తుండడం వల్ల పార్వతీ బ్యారేజ్ నిండుకుండలా తయారైంది.
ఇవీచూడండి:భారత్ బయోటెక్ ల్యాబ్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్