తెలంగాణ

telangana

ETV Bharat / state

మియావాకి తరహా పెంపకంపై ఎన్టీపీసీ యాజమాన్యానికి అభినందనలు - warangal range chief forest conservator mj akbar

పెద్దపల్లి జిల్లాలో ఎన్టీపీసీ మొక్కల పెంపకం ప్రాజెక్టులు ప్రశంసలు లభిస్తున్నాయి. 4నెలల కాలంలోనే ఎకరా స్థలంలో చిన్నపాటి అడవిని సృష్టించారని అటవీ అధికారులు కితాబిచ్చారు.

warangal range chief forest conservator visit ntpc in ramagundam
మెుక్కల పెంపకంలో ఎన్టీపీసీ యాజమాన్యానికి అభినందనలు

By

Published : May 17, 2020, 7:41 PM IST

పట్టణాల్లో అందుబాటులో ఉన్న తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచే మియవాకి విధానంలో రామగుండం ఎన్టీపీసీ సంస్థ ఆదర్శంగా నిలిచిందని వరంగల్ రేంజ్ చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ ఎంజే అక్బర్ పేర్కొన్నారు. పెద్దపెల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ యాజమాన్యం కాజిపల్లి సమీపంలో చేపట్టిన ఈ మియావాకి విధానం ద్వారా చిట్టడవుల అభివృద్ధి కోసం చేపట్టిన మొక్కల పెంపకాన్ని ఆయన పరిశీలించారు.

4 నెలల్లో మొక్కలు ఎదిగిన తీరును చూసి ఆయన అభినందించారు. తక్కువ స్థలంలో 52 రకాల జాతుల మొక్కలను పెంచి ఆదర్శంగా నిలిచారని రామగుండం ఎన్టీపీసీ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ అధికారులు, జిల్లా అటవీశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జపాన్​కు చెందిన మియావాకి తరహా పెంపకం ద్వారా.. తక్కువ స్థలంలో ఎక్కువ మొత్తంలో చెట్లను పెంచవచ్చు. తక్కువ సమయంలో చిట్టడవులను సృష్టించవచ్చు. ఈ విధానం అనుసరించే.. ఎన్టీపీసీ అటవీ శాఖ అధికారుల ప్రశంసలు అందుకుంది.

ఇవీ చూడండి: హరీశ్ చేతుల మీదగా ​ ఇళ్ల పట్టాలు పంపిణీ

ABOUT THE AUTHOR

...view details