పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేటలో వార్డుల్లో నెలకొన్న సమస్యలను సర్పంచ్ బుర్ర పద్మ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వార్డు మెంబర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై సర్పంచ్‌ను అడగగా తన భర్త అంగీకారంతో పనులు చేస్తానని చెప్పడంపై సభ్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
సర్పంచ్ దంపతుల తీరుతో ఉప సర్పంచ్ సహా వార్డు సభ్యుల వాక్ఔట్ - బేగంపేటలో గ్రామపంచాయతీలో సర్పంచ్ పనితీరుపై అభ్యతరం
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేటలో గ్రామపంచాయతీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో సర్పంచ్ బుర్ర పద్మ దంపతుల తీరుతో సమావేశాన్ని ఉప సర్పంచ్ సహా వార్డు సభ్యులు వాక్ఔట్ చేసి నిరసన వ్యక్తం చేశారు. మొత్తం ఆరుగురు సభ్యుల్లో ముగ్గురు కాంగ్రెస్, ముగ్గురు సభ్యులు తెరాసకు చెందిన వారు ఉన్నారు.
అనంతరం శ్మశానవాటికలో బోరు ఏర్పాటు చేయకుండానే బిల్లు ఎలా తీసుకున్నారని సర్పంచ్‌ను వార్డు సభ్యులు నిలదీశారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని అడిగితే సర్పంచ్, తనపై దాడి చేస్తున్నారని చెప్పి సమస్యలను పక్కదారి పట్టించడం పట్ల పాలకవర్గం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలకపక్ష నిర్ణయాల్లో సర్పంచ్ భర్త జోక్యం చేసుకోవడమేమిటని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ చంటి, వార్డు సభ్యులు తాళ్లపల్లి నరేష్, బాణాల సత్యనారాయణ, పోతరా వేణి లక్ష్మి , మాదాసు శ్రీనివాస్, శ్రీధర్, రమేష్ పాల్గొన్నారు.