పెద్దపల్లి జిల్లాలో కరోనా విజృంభన కొనసాగుతోంది. వైరస్ ఉద్ధృతికి బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. జిల్లాలోని గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఆదివారం ఇద్దరు యువకులు కరోనాతో మృతి చెందారు. పట్టణంలోని కళ్యాణ్ నగర్, శివాజీ నగర్ వ్యాపారస్తులు బుధవారం వరకు స్వచ్చందంగా దుకాణాల బంద్ చేపట్టారు. వారం రోజుల్లో ఐదుగురు కరోనాతో మృతి చెందడం వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
పెద్దపల్లిలో స్వచ్చంద లాక్డౌన్ - corona cases increase in peddapalli
పెద్దపల్లి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అప్రమత్తమైన వ్యాపారస్థులు స్వచ్చందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. అధికారులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు.
పెద్దపల్లిలో స్వచ్చంధ లాక్డౌన్
ముఖ్యంగా సింగరేణి ఎన్టీపీసీ, ఎఫ్ఎఫ్సీఐ, ఎరువుల కర్మాగారంలో పనిచేసే కార్మికులు కరోనా కాలంలోనూ విధులు నిర్వర్తించడం గమనార్హం. వైరస్ను తరిమికొట్టాలంటే... స్వీయ నియంత్రణ ఒక్కటే మార్గమని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని సూచిస్తున్నారు.
ఇవీ చూడండి:తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా... కుటుంబ సభ్యులందరికీ పాజిటివ్