రాష్ట్రంలో కుల వృత్తుల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తూ.. వారికి తగిన ప్రోత్సాహం అందిస్తోందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు పెద్దపెల్లి జిల్లా రామగుండం నగరపాలక 42వ డివిజన్లో విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
'కుల వృత్తులకు తెలంగాణ ప్రభుత్వం అండ' - telangana news
పెద్దపెల్లి జిల్లా రామగుండం నగరపాలక 42వ డివిజన్లో విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా నగర ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొన్నారు. సంఘ సభ్యులందరూ ఐకమత్యంగా ఉండాలని సూచించారు.
'కుల వృత్తులకు తెలంగాణ ప్రభుత్వం అండ'
కుల వృత్తులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తగిన ప్రోత్సాహం అందిస్తూ వారికి భరోసాగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. సంఘ సభ్యులందరూ ఐకమత్యంగా ఉండి తమ సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘానికి తాము అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డా.బంగీ అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 238 కరోనా కేసులు, 2 మరణాలు