Village Sarpanch Committed Suicide Attempt: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామ సర్పంచ్ రవీందర్ రెడ్డి అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రావడం లేదంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రేగడి మద్దికుంట గ్రామంలో సర్పంచ్ ఇటీవల 8 లక్షల సొంత నిధులతో పలు అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు.
Village Sarpanch Suicide Attempt in Peddapally District: కానీ.. అందుకు సంబంధించిన బిల్లుల చెల్లింపు విషయంలో సుల్తానాబాద్ మండల పరిషత్ అధికారులు లంచం ఆశిస్తున్నట్లు సర్పంచ్ చెప్పారు. అధికారులకు మళ్లీ మళ్లీ లంచం ఇవ్వడం ఇష్టం లేక.. ఈరోజు సుల్తానాబాద్ మండల పరిషత్ కార్యాలయం ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వెల్లడించారు.
పైగా ప్రభుత్వం నుంచి పెద్దగా నిధులు రావడం లేదని, గ్రామంలో పనులేమీ చేయలేకపోతున్నానని మనస్తాపానికి చెందారు. ఈ విషయాన్ని గ్రహించిన స్థానిక అధికారులు సర్పంచ్ రవీందర్‌రెడ్డిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కేంద్రం 8 లక్షల 85 రిలీజ్ చేసిందని.. దానిలో 40 శాతం సీసీ వారికి, 30 శాతం డ్రైనేజీకి కేటాయించిందని సర్పంచ్ తెలిపారు. సొంత డబ్బులతో పనులు చేస్తే, ఆ పనుల డబ్బులు రానివ్వకుండా ఎండీవో అడ్డు పడుతున్నాడని వాపోయారు.