పెద్దపల్లి జిల్లా కేంద్రంలో విజయదశమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. వేడుకల్లో పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొని పలు వార్డుల్లో శమీపూజలు చేశారు. జిల్లా ప్రజలకు ఎమ్మెల్యే విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.
పెద్దపల్లిలో ఘనంగా విజయదశమి వేడుకలు - పెద్దపల్లి జిల్లా దసరా వేడుకలు
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పలు వార్డుల్లో శమీపూజల్లో పాల్గొన్నారు. జిల్లా ప్రజలంతా సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.
పెద్దపల్లిలో ఘనంగా విజయదశమి వేడుకలు
ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా రావణ దహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పెద్దపెల్లి పురపాలక ఛైర్మన్ మమత రెడ్డి, పలు వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.