ముగిసిన విద్యుత్ భద్రతా వారోత్సవాలు - transco
విద్యుత్ భద్రతా వారోత్సవాల సందర్భంగా గోదావరిఖని ఉపకేంద్రం ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఉద్యోగులకు, సిబ్బందికి పెద్దపల్లి ఎస్ఈ శ్రీనివాస్ ప్రమాదాల నివారణ జాగ్రత్తలు వెల్లడించారు.
ముగిసిన విద్యుత్ భద్రతా వారోత్సవాలు
వ్యక్తిగత భద్రతతో పాటు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని పెద్దపల్లి ఎస్ఈ శ్రీనివాస్ పేర్కొన్నారు. విద్యుత్ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని గోదావరిఖని ఉపకేంద్రం ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రమాదాల నివారణకు అగ్నిమాపక సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలను శ్రీనివాస్ వివరించారు. విద్యుత్ సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించే సమయంలో సంస్థ అందించిన రక్షణ పరికరాలు ఉపయోగించాలన్నారు.