పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సింగరేణి ప్రమాదంలో మృతి చెందిన రాజేశ్, రాకేశ్ కుటుంబాలను కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు పరామర్శించారు. బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
నలుగురు కార్మికులు మృతి చెందితే.. స్థానిక తెరాస మంత్రులు బాధిత కుటుంబాలను కనీసం పరామర్శించలేదని వీహెచ్ విమర్శించారు. ప్రమాదంలో మృతి చెందిన బాధితులకు రూ. కోటి పరిహారం ఇవ్వాల్సి ఉండగా.. సింగరేణి యాజమాన్యం రూ. 40 లక్షలు అందించి చేతులు దులపుకుందని పేర్కొన్నారు. వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.