ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పలు కార్మిక సంఘాల నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ సమ్మెకు అన్ని కార్మిక సంఘాల మద్దతు ఉంటుందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
'ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా పలు కార్మిక సంఘాల నిరసన' - పెద్దపల్లి జిల్లా
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా పెద్దపల్లి జిల్లాలో పలు కార్మిక సంఘాల నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు.
'ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా పలు కార్మిక సంఘాల నిరసన'