మహనీయుల జీవితాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని వారి ఆశయాల సాధన దిశగా కృషి చేయాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. మహాకవి వాల్మీకి జయంతి, జాతీయ ఏకతా దివస్ను పురస్కరించుకుని శనివారం కలెక్టరేట్లో వాల్మీకి, సర్దార్ వల్లభభాయ్ పటేల్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.
కలెక్టరేట్లో వాల్మీకి జయంతి, ఏకతా దివస్ వేడుకలు - పెద్దపల్లి కలెక్టరేట్లో వాల్మీకి జయంతి
మహాకవి వాల్మీకి జయంతి, జాతీయ ఏకతా దివస్ను పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో ఘనంగా జరిపారు. వాల్మీకి, సర్దార్ వల్లభభాయ్ పటేల్ చిత్రపటాలకు కలెక్టర్ లక్ష్మీనారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు.
![కలెక్టరేట్లో వాల్మీకి జయంతి, ఏకతా దివస్ వేడుకలు valmiki jayanthi celebrations at peddapalli district collector office](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9378397-805-9378397-1604134651673.jpg)
కలెక్టరేట్లో వాల్మీకి జయంతి, ఏకతా దివస్ వేడుకలు
సర్దార్ వల్లభభాయ్ పటేల్ కృషి వల్ల 560 సంస్థానాలు దేశంలో విలీనమయ్యాయని కలెక్టర్ తెలిపారు. దేశంలో ఉన్న అనేక భిన్నత్వాలను ఐక్యం చేయడానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. మహాకవి వాల్మీకి హిందూ ధర్మానికి అతి ముఖ్యమైన గ్రంథం రామాయణాన్ని రచించారని.. దాని ద్వారా సమాజానికి అనేక విలువలను అందించారని కలెక్టర్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:20 రోజుల్లో వ్యవసాయేతర ఆస్తులకు రిజిస్ట్రేషన్: కేసీఆర్