తెలంగాణ

telangana

ETV Bharat / state

రామగుండం ఎరువుల కర్మాగారంలో కీలక పరిణామం.. ప్రధాని సందర్శిస్తారా..? - Urea production Stopped in Ramagundam Plant

రామగుండం ఎరువుల కర్మాగారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని రాక ముందు ఫ్యాక్టరీలో యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. యూరియా తయారీకి ఉపయోగించే అమ్మోనియా పైపు లీకేజీతో అధికారులు అప్రమత్తమై ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసి.. మరమ్మతులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్లాంట్ సందర్శనపై స్పష్టత రావాల్సి ఉంది.

రామగుండం ఎరువుల కర్మాగారంలో కీలక పరిణామం.. ప్రధాని సందర్శిస్తారా..?
రామగుండం ఎరువుల కర్మాగారంలో కీలక పరిణామం.. ప్రధాని సందర్శిస్తారా..?

By

Published : Nov 11, 2022, 5:35 PM IST

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడానికి ప్రధాని మోదీ వస్తున్న క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకొంది. ఎరువుల కర్మాగారంలో గత ఏడాదిన్నరగా ట్రయల్ నిర్వహిస్తూ లోపాలను సరి చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతుండగా.. మరోసారి ఇబ్బందులు తలెత్తాయి. యూరియా తయారీకి ఉపయోగించే అమ్మోనియా పైపు లీకేజీతో అధికారులు మరోసారి అప్రమత్తమై ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశారు.

ఈ నెల 9న రాత్రి లీక్ కాగా.. ఉత్పత్తిని 50 శాతానికి తగ్గించి మరమ్మతు చేయాలని భావించారు. అయితే అది సాధ్యం కాకపోవడంతో ఫ్లాంట్​ను పూర్తిగా నిలిపివేసి.. మరమ్మతులు చేపడుతున్నారు. ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని స్వయంగా పరిశీలించిన అనంతరం.. ఎన్‌టీపీసీ టౌన్‌షిప్‌లో బహిరంగ సభలో మాట్లాడనున్నారు. అయితే గ్యాస్‌ లీకేజీ పైప్ మరమ్మతులు కొనసాగుతున్న దృష్ట్యా.. ప్లాంట్ సందర్శనపై స్పష్టత రావాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details