సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం లక్దారం శివారులోని 65వ నంబరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓంకార్ అనే లారీడ్రైవర్ రోడ్డు దాటుతుండగా ఆకస్మాత్తుగా పటాన్చెరు నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న వాహనం ఢీకొంది.
గుర్తుతెలియని వాహనం ఢీకొని లారీ డ్రైవర్ దుర్మరణం - పటాన్చెరులో రోడ్డు ప్రమాదం
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని లారీ డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని లారీ డ్రైవర్ దుర్మరణం
దీనివల్ల అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
TAGGED:
పటాన్చెరులో రోడ్డు ప్రమాదం