పెద్దపల్లి జిల్లా నిట్టూరులో విద్యుదాఘాతంతో మృతి చెందిన రైతులు వైకుంఠం, ఓదెలు కుటుంబాలకు అండగా ఉంటామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హామీ ఇచ్చారు. వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్న వైకుంఠం, ఓదెలు విద్యుత్ తీగలు తగిలి మరణించడం శోచనీయమన్నారు. రైతుల కుటుంబ సభ్యులు మృతదేహాలతో రాస్తారోకో చేస్తున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే.. అక్కడికి చేరుకొని బాధితులను ఓదార్చారు. అనంతరం ఎస్ఈని పిలిపించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. విద్యుదాఘాతంతో మృతిచెందిన ఒక్కో రైతు కుటుంబానికి రైతుబంధు బీమాతో పాటు విద్యుత్ శాఖ తరఫున రూ.10 లక్షల పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి విద్యుత్ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తామన్నారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన లైన్మెన్తో పాటు ఏఈపై సస్పెన్షన్ వేటు వేస్తామన్నారు.
విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతి.. అండగా ఎమ్మెల్యే - పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లా నిట్టూరులో విద్యుదాఘాతంతో మృతి చెందిన రైతుల కుటుంబాలకు అండగా ఉంటామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హామీ ఇచ్చారు.
విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతి