ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఆర్టీసీ జేఏసీ తెలంగాణ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్టీసీ డిపో నుంచి ఒక్క బస్సు కూడా డిపో నుంచి బయటకు రాలేదు. మొత్తం 136 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గోదావరిఖని ఆర్టీసీ డిపో ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. డిపో ఎదుట బైఠాయించి ధర్నాకి దిగారు. నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు.
గోదావరిఖనిలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్ - గోాదావరిఖనిలో ఆర్టీసీ నిరసనకారుల అరెస్ట్
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించి ధర్నాకి దిగిన నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

గోదావరిఖనిలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్