పెద్దపల్లి జిల్లా మంథనిలో ఉదయం 5 గంటల నుంచే తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులు వ్యక్తిగతంగా పత్రాలు రాసుకుని డిపోకు చేరుకున్నారు. డిపో మేనేజర్‌ను కలిసి విధుల్లో చేరతామన్నారు.
మంథనిలో యథావిధిగా నడుస్తున్న ఆర్టీసీ బస్సులు - TSRTC buses running asusual in Manthani
పెద్దపల్లి జిల్లా మంథనిలో ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరతామన్నా అధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు లేక విధుల్లోకి చేరలేదు. ఉదయం 5 గంటల నుంచే తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి.
![మంథనిలో యథావిధిగా నడుస్తున్న ఆర్టీసీ బస్సులు TSRTC buses operating regularly in Manthani](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5179474-thumbnail-3x2-bus.jpg)
మంథనిలో యథావిధిగా నడుస్తున్న ఆర్టీసీ బస్సులు
పై అధికారుల నుంచి తమకెటువంటి ఆదేశాలు రాలేదని.. కార్మికులు విధుల్లో చేరేందుకు అవకాశం లేదని చెప్పగా కార్మికులు వెనుదిరిగారు. మంథని డిపో ముందు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మంథనిలో యథావిధిగా నడుస్తున్న ఆర్టీసీ బస్సులు