పెద్దపల్లి మున్సిపాలిటీపై తెరాస జెండా పాతింది. ఇక్కడ 36 వార్డులు ఉండగా... 23 స్థానాలు గెలుచుకుని పురపీఠం దక్కించుకుంది. ఐదు వార్డులు హస్తగతం కాగా.. 2 స్థానాల్లో కమలం వికసించింది. మజ్లిస్ పార్టీ 1 స్థానంతో సరిపెట్టుకోగా ఇతరులు 5 వార్డులు గెలుచుకున్నారు.
పెద్దపల్లి జిల్లా పురపాలికల్లో తెరాసే పెద్ద..!
పెద్దపల్లి జిల్లా పురపాలిక పీఠాలను గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథనిలో అత్యధిక వార్డులు గెలిచి తన ఆధిపత్యం నిరూపించుకుంది.
పెద్దపల్లి జిల్లా పురపాలికల్లో తెరాసే పెద్ద
సుల్తానాబాద్ పురపాలికలోనూ తెరాస పాగా వేసింది. ఈ మున్సిపాలిటీలో 15 వార్డులుండగా.. 9 స్థానాలు గెలుచుకుని కారు పార్టీ పురపీఠం దక్కించుకుంది. కాంగ్రెస్ 6 స్థానాలు కైవసం చేసుకుంది. మంథని మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠాన్ని గులాబీ పార్టీ ఆక్రమించింది. మొత్తం 13 వార్డులకు 11 స్థానాలు గెలుచుకుని సత్తా చాటింది. మిగిలిన రెండింటిని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది.
ఇవీ చూడండి: కారు జోరు.. తెలంగాణభవన్‌లో కార్యకర్తల ఊపు..
Last Updated : Jan 25, 2020, 11:31 PM IST