తెలంగాణ

telangana

ETV Bharat / state

'అబద్ధాలు, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు' - ఎంపీ వెంకటేశ్ వార్తలు

రాష్ట్ర పునర్విభజన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదేనని తెరాస నేతలు అన్నారు. అసత్య ప్రచారాలు, అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని భాజపా కార్యాలయంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

trs-leaders-serious-bjp-leaders-in-trs-bhavan
'అబద్ధాలు, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు'

By

Published : Sep 13, 2020, 7:32 PM IST

ఇటీవల కాలంలో కేంద్రమంత్రులు, రాష్ట్ర భాజపా నేతలు... అబద్ధాలు, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెరాస నేతలు ధ్వజమెత్తారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని భాజపా కార్యాలయంగా మార్చారని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్​లోని తెలంగాణ భవన్‌లో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ భానుప్రసాద్‌తో ఆయన సమావేశమయ్యారు. ఎరువుల కర్మాగారానికి ఇద్దరు కేంద్ర మంత్రులు సమీక్షకు వచ్చినప్పుడు... ప్రోటోకాల్​ పాటించకుండా... స్థానిక ఎంపీ అయిన తనకు ఆహ్వానం ఇవ్వలేదని ఎంపీ వెంకటేష్ మండిపడ్డారు.

రామగుండంలో రాష్ట్ర వాటా 11శాతం ఉందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి... స్థానిక ఎంపీ అయిన తనకు సమాచారం ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పునర్విభజన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భాజపా నేతలకు చిత్తశుద్ది ఉంటే తమతో కలిసి రావాలని లేదంటే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.

ఇదీ చూడండి:'రైతులకు యూరియా కొరత లేకుండా చేస్తాం'

ABOUT THE AUTHOR

...view details