జడ్పీ చైర్మన్ పుట్ట మధు తెరాస బలోపేతానికి నిజాయతీగా కృషి చేస్తున్నారని కమాన్పూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సత్యనారాయణ అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని తెరాస కార్యాలయంలో ఆ పార్టీ నేతలు సమావేశం నిర్వహించారు.
సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. తమ నాయకుడు పుట్ట మధు తెరాసని వీడేదిలేదని సత్యనారాయణ స్పష్టం చేశారు. మంథని నియోజకవర్గ అభివృద్ధికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.