పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలో నిర్వహించిన తెరాస ఆవిర్భావ వేడుకల్లో నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. జూలపల్లి మండల తెరాస అధ్యక్షుడు కాంతయ్య, జూలపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు రాజలింగం తానంటే తానే జెండా ఆవిష్కరణ చేస్తామని పోటీ పడ్డారు. ఈ వివాదం ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారి తీసింది.
ఆవిర్భావ వేడుకల్లో నాయకుల మధ్య గొడవ - trs celebrations at julapalli
జూలపల్లి మండల కేంద్రంలో జరిపిన తెరాస ఆవిర్భావ వేడుకల్లో స్థానిక నాయకుల మధ్య వాగ్వాదం నెలకొంది. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జోక్యం చేసుకుని ఆందోళన విరమింపజేశారు.
ఆవిర్భావ వేడుకల్లో నాయకుల మధ్య గొడవ
అనంతరం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జోక్యం చేసుకుని ఇరువురికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. ఈ వాగ్వాదం రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రఘువీర్ సింగ్ ముందే జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఇదీ చూడండి:కరోనా సోకకుండా ఏటీఎంలో ఇలా చేయండి!