పెద్దపల్లి జిల్లా మంథనిలో ప్రాదేశిక ఎన్నికల ప్రచార పర్వం ప్రారంభమైంది. జడ్పీటీసీ అభ్యర్థి, తెరాస మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మండలంలోని లక్కేపూర్, గుమ్నూర్, తోటగోపయ్యపల్లి, గాజులపల్లి గ్రామాల్లో పర్యటించారు. అడవుల్లో నడుస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. తెరాస బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
అడవుల్లో తిరుగుతూ తెరాస అభ్యర్థి పుట్ట మధు ప్రచారం - mptc and zptc
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని పలు గ్రామాల్లో జడ్పీటీసీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పర్యటించారు. ప్రజలు పనిచేసే చెరువుల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించారు.
అడవుల్లో తిరుగుతూ జడ్పీటీసీ అభ్యర్థి పుట్ట మధు ప్రచారం