తెలంగాణ

telangana

ETV Bharat / state

కారును ఢీకొన్న ట్రాక్టర్.. ఇద్దరికి గాయాలు - ramagiri mandal car tractor accident Latest News

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట-మచ్చుపేట ప్రధాన రహదారిపై కారు ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఘటనలో ట్రాక్టర్ ముందుభాగం ఇంజిన్ పూర్తిగా ఖాళీ బూడిద అయిపోయింది.

రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ దగ్ధం
రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ దగ్ధం

By

Published : Jun 7, 2020, 8:49 PM IST

పెద్దపల్లి జిల్లా రామగిరి మండల పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మచ్చుపేట వైపు నుంచి బేగంపేటకు వస్తున్న కారు, బేగంపేట వైపు నుంచి మచ్చుపేట వైపు మట్టి లోడుతో వెళ్తోన్న ట్రాక్టర్ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టింది.

కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలింపు..

ప్రమాదంలో ముగ్గురు కారులో ప్రయాణిస్తుండగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఘటనా స్థలానికి హుటాహుటిన నీటి ట్యాంకర్​ను తెప్పించి మంటలను ఆర్పేశారు. ఘటనలో ట్రాక్టర్ ముందు భాగం ఇంజిన్ పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : షేక్​పేట్​ ఘటనపై అనిశా విచారణ

ABOUT THE AUTHOR

...view details