తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వం రైతుల స్వేచ్ఛ హరిస్తోంది : ఎమ్మెల్యే శ్రీధర్​బాబు - దుద్దిళ్ల శ్రీధర్​ బాబు

రాష్ట్ర ప్రభుత్వం రైతుల స్వేచ్ఛను హరిస్తోందని కాంగ్రెస్​ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్​ బాబు ఆరోపించారు. వ్యవసాయ రంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉండాలని ఆశిస్తున్న ముఖ్యమంత్రి... చేతల్లో మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదన్నారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

TPCC Vice President Duddilla Sridhar Babu Fires On State Government And Cm Kcr
ప్రభుత్వం రైతుల స్వేచ్ఛ హరిస్తుంది : ఎమ్మెల్యే దుద్ధిళ్ల శ్రీధర్​బాబు

By

Published : May 19, 2020, 11:08 PM IST

తెలంగాణ రైతుల మీద రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు కాంగ్రెస్​ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్​ బాబు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రెస్​మీట్​లో మాట్లాడారు. కేసీఆర్​ నిర్వహించిన ప్రెస్​మీట్​పై, రైతుల పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు తమకు అనుకూలంగా ఉండే పంటలు పండించడానికి బదులు.. ప్రభుత్వం చెప్పిన పంటలు పండించడం ఎక్కడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సూచించిన పంటలు వేయకుంటే.. రైతుబంధు ఆపేస్తామని బెదిరించడం సరికాదన్నారు.

రాష్ట్రంలోని సీడ్​ కార్పొరేషన్​ ద్వారా విత్తనాలు అందిస్తామని, రైతులు వాటిని మాత్రమే తీసుకోవాలని ఒత్తిడి చేయడం ప్రభుత్వానికి తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెప్పిన పంటలు వేస్తే.. తద్వారా వచ్చే నష్టానికి పరిహారం ఇస్తారా అని ప్రశ్నించారు. రైతులను టెక్నాలజీ వాడుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.

ఇవీ చూడండి; సమగ్ర వ్యవసాయ విధానంపై మంత్రి సమీక్ష

ABOUT THE AUTHOR

...view details