ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

వామన్‌రావు కుటుంబానికి కాంగ్రెస్ నేతల పరామర్శ - telangana varthalu

న్యాయవాదుల హత్యకేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్​ నేతలు డిమాండ్​ చేశారు. వామన్​రావు స్వగ్రామం గుంజపడుగులో కుటుంబసభ్యులను ఎమ్మెల్యే శ్రీధర్​బాబుతో కలిసి పీసీసీ చీఫ్​ ఉత్తమ్​ పరామర్శించారు. నడిరోడ్డుపైన అత్యంత పాశవికంగా హత్య చేసినా ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణమన్నారు.

tpcc president uttam kumar reddy spoke on lawyer couple murder in peddapalli district
tpcc president uttam kumar reddy spoke on lawyer couple murder in peddapalli district
author img

By

Published : Feb 27, 2021, 4:41 PM IST

న్యాయవాద దంపతులను నడిరోడ్డుపైన అత్యంత పాశవికంగా హత్య చేసినా ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. వామన్‌రావు స్వగ్రామం గుంజపడుగులో కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుతో కలిసి పరామర్శించారు. ప్రాణభయం ఉంది రక్షణ కల్పించమని కోరినా పట్టించుకోని పోలీసులు.. హత్యకేసులో ఏం న్యాయం చేస్తారని ఉ‌త్తమ్‌, శ్రీధర్‌బాబు ప్రశ్నించారు.

ఇప్పటివరకు జరుగుతున్న విచారణ నటనలా కనిపిస్తోందని దుయ్యబట్టారు. రామగుండం సీపీ సత్యనారాయణతో పాటు స్థానిక పోలీసులు ఈ కేసులో న్యాయం చేస్తారన్న నమ్మకం అసలు లేదని పేర్కొన్నారు. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

వామన్‌రావు కుటుంబానికి కాంగ్రెస్ నేతల పరామర్శ

ఇదీ చదవండి: బిట్టు శ్రీను కస్టడీ కోసం మంథని కోర్టులో పోలీసుల పిటిషన్

ABOUT THE AUTHOR

...view details