పెద్దపల్లి మండలం రాఘవపూర్ గుట్టలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. పులి అడుగులను గుర్తించిన గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
రాఘవపూర్ గుట్టలో పెద్దపులి సంచారం.. భయాందోళనలో స్థానికులు - పెద్దపల్లి జిల్లా తాజా వార్తలు
పెద్దపెల్లి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం సృష్టించింది. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.
రాఘవపూర్ గుట్టలో పెద్దపులి సంచారం.. భయాందోళనలో స్థానికులు
ఘటనా స్థలికి చేరుకున్న అటవీ అధికారులు పెద్దపులి అడుగులుగా నిర్ధారించారు. జిల్లాలో సంచరిస్తున్న మగ పులి పిల్ల శనివారం రాత్రి వరకు రాఘవాపూర్ గుట్టలో ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఈ పులి పిల్లను గుర్తించేందుకు ఆదివారం ఉదయం రాఘవపూర్ గుట్ట ప్రాంతంలో నిఘా నేత్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీచూడండి.. ఇంటి తాళం పగలగొట్టి చోరీ చేసిన దొంగలు