పెద్దపల్లి జిల్లాలో పెద్దపులి కలకలం రేపుతోంది. గత 13 రోజులుగా జిల్లాలోని ఓడెడ్, సబ్బితం, రొంపికుంట, పుట్నూరు తదితర ప్రాంతాల్లో తిరిగిన ఆనవాళ్లు కనిపించడం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ రిజర్వాయర్ సమీపంలో పులి అడుగులను మల్యాలపల్లి గ్రామానికి చెందిన కొందరు యువకులు గుర్తించారు. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలుపగా.. వారు వచ్చి విచారణ చేపట్టి పులి అడుగులను గుర్తించారు.
పెద్దపల్లి జిల్లాలో పెద్దపులి కలకలం
పెద్దపల్లి జిల్లాలో పలు గ్రామాల్లో పెద్దపులి సంచారం కలకలం రేపింది. జిల్లాలోని తదితర గ్రామాల్లో పెద్దపులి ఆనవాళ్లు కనిపించడం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
పెద్దపల్లి జిల్లాలో పెద్దపులి కలకలం
దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రిజర్వాయర్ను గుర్తించిన పులి తిరుగు ముఖం పట్టినట్లు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రహమతుల్ల తెలిపారు. పులికి ఎవరూ హాని చేయవద్దని ఆయన ప్రజలను కోరారు. ఎవరైనా హాని తలపెడితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇవీ చూడండి:తేనెపూసిన కత్తిలా వ్యవసాయ బిల్లు: కేసీఆర్