తెలంగాణ

telangana

ETV Bharat / state

గుండారం జలాశయ పరిసర ప్రాంతాల్లో పెద్దపులి కలకలం

పెద్దపల్లి జిల్లా కమాన్​పూర్ మండలంలోని గుండారం జలాశయం పరిసర ప్రాంతంలో పెద్దపులి పాదాల గుర్తులు కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత 20 రోజులుగా భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల గుండా పులి తన ఆవాసం కోసం తిరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు పులి జాడ కోసం ముమ్ముర చర్యలు చేపట్టారు.

గుండారం జలాశయ పరిసర ప్రాంతాల్లో పెద్దపులి కలకలం
గుండారం జలాశయ పరిసర ప్రాంతాల్లో పెద్దపులి కలకలం

By

Published : Sep 10, 2020, 4:45 PM IST

పెద్దపల్లి జిల్లా కమాన్​పూర్ మండలంలోని గుండారం జలాశయం ప్రాంతంలో పులి పాదాల గుర్తులు కనిపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత 20 రోజులుగా భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల గుండా పులి ఆవాసం కోసం తిరుగుతున్నట్లు సమాచారం.

గుండారం జలాశయ పరిసర ప్రాంతాల్లో పెద్దపులి కలకలం

ఐదు రోజుల కిందట కలకలం..

గత ఐదు రోజుల కిందట పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం మచ్చుపేట గ్రామంలో బగులగుట్ట మీద ఆవులమందపై పులి దాడి చేసింది. కమాన్​పూర్ మండల పరిసరాల్లో పులి కాలి ముద్రలు కనిపించడంతో ప్రజల్లో కలకలం రేగింది. ఫలితంగా స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

గుండారం జలాశయ పరిసర ప్రాంతాల్లో పెద్దపులి కలకలం

గాలింపు తీవ్రం...న

పెద్దపులి తన ఆవాసం కోసం వెతుకుతుండగా, అటవీశాఖ అధికారులు వ్యాగ్రం ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పులి తన ఆవాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రతి కాలంలో అనేక ప్రాంతాలను అన్వేషిస్తూ ఉంటుందని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు.

గుండారం జలాశయ పరిసర ప్రాంతాల్లో పెద్దపులి కలకలం

అది దొరకగానే మకాం..

అనువైన ప్రదేశం దొరకగానే మకాం పెడుతుందని వివరించారు. వ్యాఘ్రం జాడ కనుక్కునేందుకు అటవీశాఖ అధికారులు ముమ్ముర ప్రయత్నాలు సాగిస్తున్నారు. రోజుకో ప్రాంతంలో సంచరిస్తూ అధికారులకు, ప్రజలకు ఆందోళన చెందుతున్నారు.

గుండారం జలాశయ పరిసర ప్రాంతాల్లో పెద్దపులి కలకలం

స్థానికుల భయోత్పాతం..

పులి అడుగు జాడలు పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుండటంతో స్థానికులు భయోత్పాతానికి గురవుతున్నారు.

ఇవీ చూడండి : 'జీరో అవర్​లో హీరోగిరి చేస్తానంటే ఎట్లా అధ్యక్షా..!'

ABOUT THE AUTHOR

...view details