పెద్దపల్లి జిల్లా మంథనిలోని కూచిరాజ్‌పల్లి దగ్గర ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మంథని- పెద్దపల్లి రహదారిపై వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టగా... బైక్‌పై ఉన్న ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరిని స్థానికులు మంథని ఆసుపత్రికి తరలించగా.. అతను చికిత్స పొందుతూ మరణించారు.
విషాదం: బైకును ఢీకొని ఈడ్చుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి - three died in road accident at kuchirajupalli in peddapalli district
ఎదురుగా వస్తున్న లారీ.. ఓ బైకును ఢీకొని కొంతదూరం ఈడ్చుకెళ్లిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీలోని కూచిరాజ్‌పల్లి వద్ద చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు మంథని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
బైకును ఢీకొని ఈడ్చుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి
మృతులు మహదేవ్‌పూర్‌లోని ఇసుక క్వారీలో పనిచేస్తున్న వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. సోమవారం ఉదయం స్వస్థలానికి వెళ్లేందుకు బైక్‌పైన బయలు దేరారు. కూచిరాజ్‌పల్లి దగ్గర ఎదురుగా వస్తున్న లారీ బైక్‌ను ఢీకొని కొంతదూరం వరకు లాక్కెళ్లింది. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను మార్చురీకి తరలించారు. అక్కడ భారీగా గుమిగూడిన ప్రజలను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
ఇదీ చదవండి:ఈటల ఓఎస్డీకి కరోనా... గత 2రోజులుగా ఆయనతోనే మంత్రి