పెద్దపల్లి జిల్లా మంథని మండలం దుబ్బపల్లిలో.. రోజు రోజుకు పెరుగుతోన్న కొవిడ్ కేసులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా గ్రామంలో స్వచ్ఛందంగా లాక్ డౌన్ ప్రకటించుకున్నారు. ప్రజల సంక్షేమం దృష్ట్యా..10 రోజుల పాటు లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ నరేశ్రావు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరుచుకుని ఉంటాయన్నారు.
స్వచ్ఛందంగా లాక్ డౌన్ ప్రకటించుకున్న గ్రామం - పెద్దపల్లి జిల్లా కొవిడ్ కేసులు
కరోనా మహమ్మారి రోజురోజుకు పెరుగుతుండటంతో పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని దుబ్బపల్లి గ్రామం.. స్వచ్ఛందంగా లాక్ డౌన్ ప్రకటించుకుంది. పంచాయతీ తీర్మానాన్ని ఉల్లంఘిస్తే.. వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని గ్రామస్థులను హెచ్చరిస్తోంది.
self lockdown
పంచాయతీ తీర్మానాన్ని ఉల్లంఘిస్తే రూ.1000 జరిమానా విధిస్తామని సర్పంచ్ హెచ్చరించారు. గ్రామంలోకి బయటివారు ప్రవేశించకుండా ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:రెండు చుక్కల నిమ్మరసంతో కరోనా ఖతం