న్యాయవాది వామన్‌రావు దంపతులు వేసిన కేసులకు భయపడే వారిని అతికిరాతకంగా హత్య చేయించారని ఆయన తండ్రి కిషన్‌రావు ఆరోపించారు. ఈ హత్యలో పుట్ట మధు దంపతులు పరోక్షంగా పాల్గొన్నారని ఆక్షేపించారు. తాను దుఃఖంలో ఉన్న సమయంలో ఫిర్యాదు తీసుకున్న రామగిరి ఎస్సై... దర్యాప్తులో నిందితులందరూ బయటపడతారని తెలిపినట్లు వెల్లడించారు. అసలైన నిందితుల పేర్లు ఇప్పటికీ చేర్చలేదన్నారు.
'వామన్‌రావు దంపతుల హత్య కేసులో విచారణ సరిగా జరగలేదు' - వామన్‌రావు దంపతుల హత్య కేసు
పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగుకు చెందిన హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసులో విచారణ మాత్రం సరిగా జరగలేదని వామనరావు తండ్రి కిషన్‌రావు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో పుట్టమధుతో పాటు పూదరి సత్యనారాయణ హస్తం కూడా ఉన్నట్లు ఆక్షేపించారు.
The trial in the Vaman Rao couple murder case was not conducted properly
ఈ కేసులో విచారణ సరిగా జరగలేదని... ఏప్రిల్ 16 న ఐజీ నాగిరెడ్డికి రెండు పేజీల లేఖను రాసినట్టు తెలిపారు. అవసరమైతే తనపై నార్కో టెస్ట్ కూడా చేయమన్నట్టు వెల్లడించారు. గ్రామ, మండల స్థాయి నుంచి హైదరాబాద్ వరకు పలువురి హస్తం ఈ హత్యలో ఉందన్నారు. ఈ హత్యలో పుట్టమధుతో పాటు, కమాన్‌పూర్ మార్కెట్ ఛైర్మన్ పూదరి సత్యనారాయణ భాగస్వామ్యం కూడా ఉందని ఆరోపించారు.