తెలంగాణ

telangana

ETV Bharat / state

డే టైం దొంగ.. 72 చోరీలు.. చివరికి కటకటాల్లోకి - Telangana crime news

police arrested the thief in Ramagundam: ముందుగా ఓ రోజు రెక్కీ నిర్వహిస్తాడు.. మరుసటి రోజు పగటిపూటనే దొంగతనాలకు పాల్పడుతుంటాడు. ఇలా మూడేళ్ల నుంచి 72 దొంగతనాలు చేసి పోలీసులకు చిక్కకుండా తిరిగాడు. చివరకు మంచిర్యాల జిల్లా సీసీనస్పూర్ వద్ద పోలీసులు అనుమానాస్పదంగా పట్టుకొని ఆరా తీయడంతో దొంగతనాల చిట్టా బయట పడింది.

డే టైం దొంగ
డే టైం దొంగ

By

Published : Mar 9, 2023, 8:38 PM IST

police arrested the thief in Ramagundam: మాములు వ్యక్తిలాగే వీధులలో తిరుగుతుంటాడు. ముందురోజు రెక్కి నిర్వహించి పగటివేళలో చోరీలకు పాల్పడుతుంటాడు. బతుకుదెరువుకై రామగుండంకు వచ్చిన వ్యక్తి జల్సాలకు అలవాటు పడి గజదొంగలా మారాడు. కోట్ల రూపాయల సొత్తును కాజేశాడు. వింతేమిటంటే దొంగతనం కేసులు నమోదయ్యాయి కానీ పోలీసులకు చిక్కలేదు. చివరగా సీసీనస్పూర్ పోలీసులు రోజువారి విధుల్లో భాగంగా పెట్రోలింగ్​ చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా పట్టుకుని ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. నిందితుడి నుంచి కారు, బైక్​లను స్వాధీనం చేసుకున్నారు.

నెల్లూరు జిల్లాకు చెందిన రాజవరపు వెంకటేశ్వర్లు(28) బతుకుదెరువు కోసం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​కు వచ్చాడు. ఇక్కడి స్థానిక యువతిని పెళ్లి చేసుకున్నాడు. మద్యానికి, ఆన్​లైన్ బెట్టింగ్​లకు అలవాటు పడ్డాడు. విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు దొంగతనాలు చేయడం అలవాటు చేసుకున్నాడు. ఇదే క్రమంలో పగటి సమయాల్లో వివిధ ప్రాంతాలను గమనిస్తాడు... మరుసటి రోజు పక్కాగా ప్లాన్​ను అమలు చేస్తాడు.

ఇలా గత మూడేళ్ల నుంచి రామగుండం కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడ్డాడు. మొత్తంగా ఇతడిపై 72 కేసులు వివిధ పోలీసుస్టేషన్లలో నమోదయ్యాయి. ఈ దొంగతనాలలో 2.89 కిలోల బంగారం, 4.07 కిలోల వెండి, 19 లక్షల రూపాయాల నగదు చోరీ చేశాడు. వీటి విలువ సుమారు కోటి 20 లక్షల ఉంటుంది. చోరీ చేసిన సొమ్ములో 90 శాతం ఆన్​లైన్​ బెట్టింగ్​కు ఖర్చు చేసి మిగతా 10శాతం డబ్బుతో​ విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. కేసును చేధించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులను సీపీ అభినందించి, నగదు రివార్డును అందించారు.


"నెల్లూరు జిల్లాకు చెందిన రాజవరపు వెంకటేశ్వర్లు(28) బతుకుదెరువు కోసం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​కు వచ్చాడు. ఇలా గత మూడేళ్ల నుంచి రామగుండం కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడ్డాడు. మొత్తంగా ఇతడిపై 72 కేసులు వివిధ ప్రాంతాల పోలీసుస్టేషన్లలో నమోదయ్యాయి. ఈ దొంగతనాలలో 2.89 కిలోల బంగారం, 4.07 కిలోల వెండి, 19 లక్షల రూపాయాల నగదు చోరీ చేశాడు. వీటి విలువ సుమారు కోటి 20 లక్షల ఉంటుంది. చోరీ చేసిన సొమ్ములో 90 శాతం ఆన్​లైన్​ బెట్టింగ్​కు ఖర్చు చేసి మిగతా 10శాతం డబ్బుతో​ విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు." -రెమా రాజేశ్వరి, పోలీస్ కమిషనర్, రామగుండం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details