కరోనా కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తోంది. కరోనా చిచ్చుతో ఎన్నో కుటుంబాలు అతలాకుతలం అవుతున్నాయి. కొవిడ్ వైరస్ బారిన పడి 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు భార్యాభర్తలు మృతి చెందడంతో పిల్లలు అనాధలుగా (children orphaned) మారిపోయారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేటకి చెందిన కుడికళ్ల మల్లేష్(30), అతని భార్య సృజన(26) దంపతులు కరోనాతో మరణించడంతో(corona deaths) ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మల్లేష్ 10 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్‌కి వెళ్లి ఓ మెడికల్ అండ్ జనరల్ స్టోర్‌ను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. వారికి మణిదీప్ (11), శ్రీచరణ్ (7)ఇద్దరు పిల్లలు… 10 రోజుల క్రితం వారు కరోనా బారిన పడడంతో కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రోజున మల్లేష్ మృతి చెందాగా... గురువారం అతని భార్య సృజన కూడా మృతి చెందింది. దీంతో వారిని స్వగ్రామమైన బేగంపేటకు తీసుకువచ్చి అంత్యక్రియలను పూర్తి చేశారు.
corona deaths: దంపతులు మృతి, అనాధలుగా మారిన పిల్లలు - couple died with corona
అంతు చిక్కని కరోనా వ్యాధితో కొన్ని కుటుంబాలు ఆర్థికంగా దిగజారి రోడ్డున పడుతుండగా... మరికొన్ని కుటుంబాల్లో పెద్ద దిక్కులు మరణించడంతో అనేక మంది అనాధలుగా మారిపోతున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలో ఒకే కుటుంబంలో దంపతులు మృతి (corona deaths) చెందడంతో వారి పిల్లలు దిక్కులేని (children orphaned) వారయ్యారు. ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
corona deaths: దంపతులు మృతి, అనాధలుగా మారిన పిల్లలు