పెద్దపెల్లి, భూపాలపల్లి జిల్లాల మధ్య అడవి సోమనపల్లి వద్ద మానేరు వాగుపై 1971లో పీవీ నరసింహారావు హయాంలో బ్రిడ్జ్‌ని నిర్మంచారు. ఈవంతెనపై నుంచి మహారాష్ట్ర, వరంగల్, కరీంనగర్, చెన్నూరు ప్రాంతాలకు నిత్యం వేలాది మంది ప్రయాణం చేస్తుంటారు. అయితే ఇప్పడు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆవంతెనకు ఇరువైలా పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగి.. టెలికామ్ అధికారులు వేసిన సిమెంట్ కేబుల్ దిమ్మలు బ్రిడ్జ్‌పై కూలి, అక్కడక్కడ పగుళ్లు ఏర్పడి అతి ప్రమాదకరస్థితి చేరుకుంది.
అధికారుల నిర్లక్ష్యం... ప్రమాదకరంగా మారిన వంతెన - అడవి సోమనపల్లి వద్ద మానేరు వాగుపై బ్రిడ్జ్ తాజా వార్త
పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమనపల్లి వద్ద మానేరు వాగుపై నిర్మించిన వంతెన అధికారుల నిర్లక్ష్యం శిథిలావస్థకు చేరుకుంది. బ్రిడ్జ్‌పై అనేక చోట్ల పగుళ్లు, పిచ్చి మొక్కలు, మట్టితో నిండిపోయి ప్రమాదకరంగా మారింది.
అధికారుల నిర్లక్ష్యం... ప్రమాదకరంగా మారిన వంతెన
ఏ ఒక్క అధికారి బ్రిడ్జ్ మరమ్మతు పనులకు పూనుకోలేదు సరికదా.. ఇంతవరకు వచ్చి దానిని చూసిన పాపాన పోలేదని ప్రయాణికులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదిలానే కొనసాగితే వంతెన మరింత ప్రమాదకర స్థితికి వెళ్తుందని ఇప్పటికైనా అధికారులు చొరవతీసుకుని దానికి పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతున్నారు.
TAGGED:
bridge damage latest news