ప్రజల్లో ఆదరణ తగ్గుతున్నందునే ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు సిద్ధమైందని భాజపా విమర్శించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు పోరాటం కొనసాగిస్తామని పెద్దపల్లి జిల్లా భాజపా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ తెలిపారు. పట్టణంలోని పాలనాధికారి కార్యాలయం ముందు శ్రేణులతో కలిసి ధర్నా చేపట్టారు.
ఎన్నికల హామీలను నెరవేర్చాలంటూ భాజపా ఆందోళన - పెద్దపల్లి జిల్లాకేంద్రంలో భాజపా ఆందోళన
తెరాస ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ భాజపా ఆందోళన నిర్వహించింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేసింది.
ఎన్నికల హామీలను నెరవేర్చాలంటూ భాజపా ఆందోళన
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. తెరాస అధికారంలోకి వచ్చిన ఏడేళ్ల తర్వాత నిరుద్యోగులు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగ నియామకాలు భర్తీ చేసేవరకు ఆందోళనలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అనంతరం అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు.