పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని సంజయ్ గాంధీనగర్లో 200 మంది నిరుపేదలకు ప్రైవేట్ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రామగుండం మేయర్ అనిల్ కుమార్లు హాజరై పలువురికి సరకులు అందించారు.
పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ప్రైవేట్ పాఠశాలల సంఘం - ఎమ్మెల్యే కోరుకంటి చందర్
కరోనా కట్టడి చేయడానికి ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో నిరుపేదలు ఆకలితో అలమటించకూడదని కొందరు దాతలు, సంఘాలు ముందుకొస్తున్నాయి. నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ప్రైవేట్ పాఠశాలల సంఘం
ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను అభినందించారు. గోదావరిఖనిలోని ఆపిల్ కిడ్స్ పాఠశాల ప్రిన్సిపాల్ సునిత నిరుపేదలకు ఒక్కొక్కరికి వంద రూపాయల నగదును అందజేశారు. ప్రతి ఒక్కరూ సేవ చేయడం బాధ్యతగా తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ఇదీ చూడండి :'తేమ, తాలు, మిల్లర్ల సమస్యలున్న మాట వాస్తవమే'