korukanti chandar News : పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రామగుండం ఎరువుల కర్మాగారం ఉద్యోగాల విషయంలో ఎమ్మెల్యే అనుచరులు డబ్బు వసూలు చేశారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే తాము డబ్బు వసూలు చేసినట్లు నిరూపించాలని వారికి సవాల్ విసిరారు. దీనికి ధీటుగా విపక్షాలు తమతో చర్చించేందుకు ఎరువుల కర్మాగారానికి రావాలని వారు ప్రతి సవాల్ విసిరారు.
రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత - ramagundam latest news
Mla Korukanti Chander News : పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రామగుండం ఎరువుల కర్మాగారం ఉద్యోగాల విషయంలో ఎమ్మెల్యే అనుచరులు డబ్బు వసూలు చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
![రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత Mla Korukanti Chander News](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16011098-542-16011098-1659594864390.jpg)
కోరుకంటి చందర్
ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న కూడా రామగుండం వస్తానని ప్రకటించారు. దీంతో అధికార, ప్రతిపక్ష నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఎరువుల కర్మాగారానికి బయలుదేరుతున్న ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ను పోలీసులు బలవంతంగా కార్యాలయంలోకి తీసుకువెళ్లి నిర్బంధించారు.
రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత
Last Updated : Aug 4, 2022, 12:22 PM IST