పెద్దపల్లి జిల్లా మంథనిలో ఈరోజు భానుడి ప్రతాపం బాగా కనిపించింది. వారం రోజులుగా వేసవి ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతుండడం వల్ల అత్యధిక గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే 46 డిగ్రీలకు చేరుకుంది. ఎండలకు వడగాల్పులు తోడవడం వల్ల భానుడి ప్రతాపం పెరిగింది. గాలిలో తేమ శాతం తగ్గిపోయి ఉక్కపోతతో ఇళ్లకే పరిమితమైన ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈరోజు మంథనిలో రోడ్లు, వీధులు నిర్మానుష్యంగా కనిపించాయి.
భగ భగ మండుతున్న భానుడు - temperatures raised in telangana
పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో ఉష్ణోగ్రత 46 డిగ్రీలకు చేరుకుంది. పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల వ్యాపారాలు లేక ఇబ్బంది పడుతున్నామని చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భగ భగ మండుతున్న భానుడు
పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కూడా ఆందోళనకు గురవుతున్నారు. మొన్నటి వరకు లాక్ డౌన్ వల్ల ఇప్పుడు భానుని ప్రతాపం వల్ల వ్యాపారాలు సరిగా జరగడం లేదని చిరు వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. అత్యావసర పనుల కోసమే బయటికొచ్చే ప్రజలు ప్రస్తుతం కొబ్బరి నీరు, సోడాలు, పండ్ల రసాలతో కడుపు నింపుకొని సేద తీరుతున్నారు.
ఇవీ చూడండి: మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు