Singareni Workers Samme : సింగరేణి సంస్థకు చెందిన నాలుగు బొగ్గు బ్లాక్లను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థలోని కోయగూడెం, కేకే -6, సత్తుపల్లి, శ్రావనపల్లి 4.. బ్లాకులను వేలం వేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఆర్జీ-1 ఏరియాలోని సింగరేణి జీడీకే 2 ఇంక్లైన్ బొగ్గు గని వద్ద సింగరేణి కార్మికులు, టీబీజీకేఎస్, జాతీయ సంఘాలు చేస్తున్న సమ్మెకు మంత్రి సంఘీభావం తెలిపారు.
Singareni Workers Samme: 'ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులను కార్పొరేట్లకి కట్టబెట్టడమేంది..?' - సింగరేణి కార్మికుల నిరసనలు
Singareni Workers Samme: ప్రభుత్వరంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. సింగరేణి సంస్థలోని నాలుగు బ్లాక్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఆర్జీ-1 ఏరియాలోని సింగరేణి జీడీకే-2 ఇంక్లైన్ బొగ్గుగని వద్ద కార్మికులు చేస్తున్న సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు.

సింగరేణి సంస్థపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి ఎందరో జీవిస్తున్నారని.. 133 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థకు సంబంధించి బ్లాకులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం సమంజసం కాదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని.. కేంద్ర నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే.. దశలవారీగా నిరసన చేపడతామని హెచ్చరించారు. మంత్రి కొప్పులతో పాటు పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి.. కార్మికులకు సంఘీభావం తెలిపారు.
ఇదీ చూడండి: