Floating Solar Power Plant:పెద్దపల్లి జిల్లా రామగుండంలో... నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తికాగా దశల వారీగా ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ ప్లాంట్‌లో రెండో దశలో మరో 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించామని ఎన్టీపీసీ ఈడీ సునీల్ కుమార్ తెలిపారు. తొలి విడత 17 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేశామని వివరించారు.
దేశంలోనే పెద్దది
దేశంలోనే అతిపెద్ద నీటిపై తేలియాడే సోలార్ ప్లాంట్‌ను ఎన్టీపీసీలోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌పై ఏర్పాటు చేస్తున్నారు. కరోనా కారణంగా కొంత ఆలస్యమైనా... ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో బీహెచ్ఈఎల్ నిర్మాణం పనులు చేపడుతోంది. రామగుండం ఎన్టీపీసీలోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌పై మొత్తం 450 ఎకరాల విస్తీర్ణంలో రూ.430 కోట్లతో ప్లాంటు నిర్మాణం జరిగింది. దేశవ్యాప్తంగా 450 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి ప్లాంట్ల నిర్మాణం చేపట్టిన ఎన్టీపీసీ.. రామగుండంలో 100 మెగావాట్లతో పవర్ ప్లాంటును ఏర్పాటు చేసింది.
రామగుండంలో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తి ఇదీ చదవండి:కేఆర్‌ఎంబీ ఆధ్వర్యంలో చెన్నై తాగునీటి కమిటీ సమావేశం.. పాల్గొన్న తెలుగు రాష్ట్రాలు