తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ వీరప్పన్​పై పీడీ యాక్ట్ నమోదు - Telangana Veerappan Arrested by Ramagundam Police

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కలప స్మగ్లర్ తెలంగాణ వీరప్పన్​గా పేరుపొందిన పొందిన ఎడ్ల శ్రీనివాస్ అలియాస్ పోతారం శ్రీనివాస్​పై పీడీ యాక్ట్ కేసు నమోదైంది. అతని అనుచరులైన కుడుదల కిషోర్ కుమార్, కొరవెన మధుకర్​పై కూడా కేసు నమోదు చేసినట్లు రామగుండం సీపీ సత్యనారాయణ పేర్కొన్నారు.

తెలంగాణ వీరప్పన్​పై పీడీ యాక్ట్ నమోదు

By

Published : May 8, 2019, 9:16 PM IST

గత రెండు దశాబ్దాలుగా అటవీ సంపదను కొల్లగొడుతూ ప్రభుత్వానికి కోట్ల రూపాయలు గండికొడుతూ వస్తున్న ఎడ్ల శ్రీనివాస్​పై ఎట్టకేలకు రామగుండం పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. రాష్ట్రంలో కలప స్మగ్లింగ్​లో అతను తెలంగాణ వీరప్పన్​గా ఎదిగాడు. 4 రాష్ట్రాల్లో కలపను అక్రమంగా రవాణా చేస్తూ అటవీ, పోలీస్ అధికారులకు చిక్కకుండా మాఫియా సామ్రాజ్యంను విస్తరించాడు. ఈ ముఠాను ఏప్రిల్ 9న రామగుడం పోలీసులు అరెస్టు చేశారు. ఇతనికి కొందరి రాజకీయ నాయకుల అండదండలు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా కలప స్మగ్లర్ ముఠాను పట్టుకోవడానికి కృషిచేసిన పోలీస్ అధికారులకు రామగుండం సీపీ సత్యనారాయణ రివార్డులను అందజేశారు.

తెలంగాణ వీరప్పన్​పై పీడీ యాక్ట్ నమోదు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details