పెద్దపల్లి జిల్లా మంథనిలో తెరాస పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. తెరాస ఆవిర్భవించి 20 ఏళ్లు గడిచిన సందర్భంగా పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు గులాబీ జెండాను ఎగురవేశారు.
'తెరాస పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర' - పెద్దపల్లిలో 20వ తెరాస ఆవిర్భావ వేడుకలు
తెరాస పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర అని పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టమధు అన్నారు. మంథనిలో తెరాస పార్టీ 20వ ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు.
పెద్దపల్లిలో తెరాస 20వ ఆవిర్భావ వేడుకలు
అనంతరం తెరాస తరఫున ప్రజలకు మాస్కులు అందజేశారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. తెరాస పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర అని పుట్టమధు అన్నారు. తెలంగాణలో తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోనే అగ్రగామిగా మన రాష్ట్రం నిలిచిందన్నారు.